బజాజ్ నుంచి క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు వాటికి చికిత్సకయ్యే ఖర్చులు లక్షల్లో ఉంటున్నాయి. తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఎదురయ్యే ఆర్థికభారం ఒక్కసారిగా తలకుమించిన భారం అవుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ బీమా సేవల సంస్థ బజాజ్ అలయన్జ్ లైఫ్ క్రిటికల్ ఇల్‌నెస్‌ను కవర్ చేసే ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బజాజ్ అలయన్జ్ లైఫ్ హెల్త్ కేర్ గోల్ పేరుతో విడుదల చేసిన ఈ ప్లాన్ 36 రోగాలకు వర్తించనున్నదని కంపెనీ ఎండీ, సీఈవో తరుణ్ ఛుగ్ తెలిపారు. ఈ పాలసీ ఒక్క ప్రీమియంతో కుటుంబంలోని ఆరుగురికి బీమా వర్తించనున్నది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, క్యాన్సర్, ఉపిరితిత్తులు, తలకు తీవ్రగాయం, బ్రెయిన్ సర్జరీ వంటి వాటికి ఈ పాలసీ వర్తించనున్నదన్నారు. వార్షిక ప్రీమియం కింద వ్యక్తిగతంగా రూ.3,500 నుంచి రూ.50 వేల వరకు నిర్ణయించింది. ఏ మెడిక్లెయిం పాలసీతో అయినా కలిపి క్లెయిం చేసుకోవచ్చును.

Related Stories: