అలో మెసేజింగ్ యాప్‌ను నిలిపివేయనున్న గూగుల్

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన అలో మెసేజింగ్ యాప్‌ను నిలిపివేయనుంది. మార్చి 2019 నుంచి ఈ యాప్‌ను నిలిపివేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. అయితే అలో యాప్ యూజర్లను హ్యాంగవుట్స్ చాట్, మీట్ యాప్‌లకు అప్‌గ్రేడ్ చేస్తామని గూగుల్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇక గూగుల్ వీడియో కాలింగ్ యాప్ డ్యుయో యథావిధిగా కొనసాగుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదే ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు, క్రోమ్‌బుక్‌లకు డ్యుయో వీడియో కాలింగ్ యాప్ సపోర్ట్‌ను అందించారు. కానీ అలో మెసేజింగ్ యాప్‌కు యూజర్ల నుంచి అంతంత మాత్రమే ఆదరణ లభిస్తుండడంతో ఇకపై ఆ యాప్‌ను కొనసాగించలేమని, అందుకనే ఆ యాప్‌ను నిలిపివేస్తున్నామని గూగుల్ వెల్లడించింది.

Related Stories: