బాహుబలి సక్సెస్ మీట్ కి ఏర్పాట్లు..!

తెలుగు సినీ చిరిత్రలో ఓ భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కి ఇండియన్ సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన చిత్రం బాహుబలి ది కంక్లూజన్. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. కేవలం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో అభిమానులలో ఉత్కంఠని పెంచిన రాజమౌళి ఆ సీక్రెట్ ని రివీల్ చేసి ఫ్యాన్స్ లో అంతులేని ఆనందాన్ని పెంచాడు. కేవలం తెలుగులోనే కాక అనేక భాషలలో బాహుబలి 2 చిత్రం విజయదుందుభి మ్రోగించింది. మరి కొద్ది రోజులలో 1500 కోట్ల మార్క్ ని అందుకునేందుకు ఈ చిత్రం ఉరకలు పెడుతుండగా, అంత గొప్ప విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు రాజమౌళి థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. చిత్ర టీంలోని నటీనటులు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, వారి డేట్స్ అడ్జెస్ట్ మెంట్ ని బట్టి ఒక రోజు సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. త్వరలోనే బాహుబలి చిత్ర సక్సెస్ మీట్ తేది, వెన్యూ వివరాలు వెల్లడించనున్నట్టు టాక్.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి