బాహ‌బ‌లి ఖాతాలో మ‌రో అంత‌ర్జాతీయ అవార్డు

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన చిత్రం బాహుబ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా అశేష ఆద‌ర‌ణ సంపాదించుకున్న ఈ చిత్రం ఎన్నో అవార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. తాజాగా మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అంత‌ర్జాతీయ అవార్డు బాహుబ‌లికి ద‌క్కింది. 44వ శాట‌ర‌న్ అవార్డుల ప్రధానోత్స‌వంలో భాగంగా బాహుబ‌లి చిత్రానికి అవార్డు అందించారు. ఈ కేట‌గిరిలో బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ చిత్రంతో పాటు ఆరు సినిమాలు పోటీ ప‌డ‌గా, బాహుబ‌లి చిత్రం అవార్డు ద‌క్కించుకుంది. అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్ సంస్థ శాటరన్ ఈ అవార్డులను అందించింది. బాహుబ‌లి చిత్రానికి మ‌రో అంత‌ర్జాతీ అవార్డు ద‌క్క‌డంపై సినీ ప్ర‌ముఖుల‌తో పాటు చిత్ర టీం కూడా సంతోషం వ్య‌క్తం చేసింది. రెండు పార్టులుగా విడుద‌లైన బాహుబ‌లి చిత్రం సంచ‌ల‌నాలు క్రియేట్ చేయ‌గా, మ‌రో పార్ట్ తీస్తే బాగుంటుంద‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Stories: