భర్తను హత్య చేయడం ఎలా? రాసింది.. చేసింది!

నాన్సీ క్రాంప్టన్-బ్రాఫీ అమెరికా రచయిత. రొమాన్స్ రాయడంలో అందెవేసిన చెయ్యి. ఒకప్పుడు ఆమె హౌ టు మర్డర్ యువర్ హజ్బెండ్ (భర్తను హత్య చేయడం ఎలా) అనే వ్యాసం రాసింది. ఇప్పుడు భర్త డ్యాన్ బ్రాఫీ హత్యకేసులో అరెస్టు అయ్యింది. ఒరేగాన్ రాష్ట్రం పోర్ట్ ల్యాండ్ పోలీసులు ఆమెను సెప్టెంబర్ 5న అరెస్టు చేశారు. హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని ఉపయోగించడం అనే ఆరోపణలు ఆమెపై నమోదు చేశారు. అయితే ఈ హత్యకు కారణాలుగానీ, ఇతర వివరాలనుగానీ పోలీసులు వెల్లడించలేదు. షెఫ్‌గా పేరున్న డ్యాన్ తాను పనిచేసే ఓరేగాన్ క్యూలినరీ ఇన్‌స్టిట్యూట్‌లో గత జూన్ 2న హత్యకు గురయ్యారు. రచయిత్రి తన భర్త హత్యపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఇన్‌స్టిట్యూట్ దగ్గర కొవ్వొత్తులతో నివాళి కూడా నిర్వహించారు. నాన్సీపై పోలీసులు చేస్తున్న ఆరోపణలను ఆమె సన్నిహితులు ఎవరూ నమ్మడం లేదు. ఇదంతా పిచ్చి. ఇది నిజం కాదు అని నాన్సీ సోదరి అన్నారు. మరి సలు నిజం ఏమిటి? అనేది ప్రశ్న.

Related Stories: