ముళ్ల పొదల్లో ఏటీఎం కార్డులు

ఆళ్లపల్లి, : బ్యాంకు ఖాతాదారులకు చేరవలసిన 364 ఏటీఎం కార్డులు జల్లేరు వాగు ఒడ్డున ముళ్లపొదల్లో కనిపించాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏటీఎం కార్డులు ముళ్లపొదల్లో లభ్యమవడంతో రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఆళ్లపల్లి తహసీల్దార్ ఎండీ ముజాహిద్, ఎస్సై అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామ శివారుల్లో జల్లేరు వాగు వద్ద ముళ్ల పొదల్లో పశువుల కాపరి సమ్మయ్యకు కవర్‌లో ఏటీఎం కార్డులు ఉండటాన్ని గమనించాడు. ఆ కార్డులపై స్థానికుల ఫొటోలు ఉండటంతో మంగళవారం ఉదయం గ్రామస్తులకు తెలిపాడు. ఒకేచోట 364 ఏటీఎం కార్డులు దొరికాయని సమాచారంతో ఎన్నికల ఫ్లయింగ్ స్వాడ్ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శ్రీనివాస్, వీఆర్‌వో నర్సింహారావు, ఆళ్లపల్లి ఎస్సై అంజయ్య, విచారణ చేపట్టారు. కార్డులను సీజ్ చేసి స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేసి విచారాణ చేస్తామన్నారు.

Related Stories: