హాయ్.. నాపేరు జింజర్.. నేను మీకు ఏవిధంగా సాయపడగలను..

ఎవరీ జింజర్ అని నెత్తిగోక్కోకండి. అది రోబో. రోబో సినిమాలో రజినీకాంత్ ఓ రోబోను తయారు చేసి చిట్టీ అని పేరు పెడతాడు కదా. ఇది కూడా అంతే. దీని పేరు జింజర్. నేపాల్ మొట్టమొదటి రోబో వెయిటర్. ఖాట్మండుకు చెందిన లోకల్ కంపెనీ పాయిలా కంపెనీ ఈ జింజర్ అనే రోబోను తయారు చేసింది. 1.5 మీటర్ల పొడవు ఉన్న ఈ రోబోకు ఇంగ్లీష్, నేపాలీ వచ్చు. దీన్ని ఖాట్మండులోని నౌలో రెస్టారెంట్‌లో వెయిటర్‌గా జాయిన్ చేశారు. కస్టమర్లు ఆర్డర్ ఇవ్వగానే ట్రేలో వాళ్లకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి వాళ్ల టేబుల్‌పై పెడుతుంది. ప్లీజ్ ఎంజాయ్ యువర్ మీల్ అంటూ కస్టమర్లకు చెబుతుంది. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందట. టెస్టింగ్ దశ అయినప్పటికీ.. ఆ రోబోలో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామింగ్ చేసినట్టుగానే కస్టమర్లకు సర్వ్ చేస్తున్నదట. అదే రెస్టారెంట్‌లో మొత్తం మూడు రోబోలు వెయిటర్‌గా పనిచేస్తున్నాయట. కస్టమర్లు కూడా వాటి సర్వీస్‌కు ముగ్ధులవుతున్నారు. అంతే కాదు.. రోబోలను చూడటానికే కస్టమర్లు ఆ రెస్టారెంట్‌కు క్యూ కడుతున్నారట.

Related Stories: