మిషన్‌భగీరథ పథకం విజయవంతంగా పూర్తి చేశాం...

54 లక్షల ఇళ్లకు నిత్యం భగీరథ మంచినీళ్లు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాం. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రజలు ఏ నీళ్లు తాగుతున్నారో ఆదిలాబాద్ గోండుగూడెం ప్రజలు కూడా అవే నీళ్లు తాగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో నల్లగొండ ప్రజలు ప్లోరైడ్ నీళ్లు తాగి ఆవస్థలు పడ్డారు. మేం అధికారంలోకి వచ్చాక 35వేలపై చిలుకు వాటర్ ట్యాంకులు కట్టాం. మిషన్ భగీరథను చూసి కేంద్రం జల్ శక్తి అభియాన్ అని పెట్టుకుంది. మిషన్ భగీరథ ఎలా వుందని కేంద్రం వచ్చి అధ్యయనంచేస్తోంది. ఆరోగ్యశ్రీ మే తెచ్చింది కాదు... కాంగ్రెస్ తెచ్చింది. వైఎస్‌ఆర్ తెలంగాణ వ్యతిరేకి. అయినా వైఎస్ పెట్టిన ఆరోగ్యశ్రీని కొనసాగిస్తామని చెప్పినం. మన బీజేపీ ఎమ్మెల్యే పెట్టే లొల్లి వశమైతలేదు. కాంగ్రెస్ ఏమీ చేయలేదని టీఆర్‌ఎస్ కూడా ఏమీ చేయొద్దా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.