రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం...

హైదరాబాద్: ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతుబంధును బీజేపీ మంత్రులే వచ్చి మెచ్చుకుంటున్నారు. రైతుబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ఒడిషా సీఎం నా సమక్షంలోనే ప్రకటించారు. గతంలో రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఏ ప్రభుత్వమూ కనికరించలేదు. గుంటభూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల్లో రూ.5 లక్షలు పరిహారం ఇస్తున్నం. తెలంగాణలో అప్పులేని రైతు లేడు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఎత్తిపోతల కరెంటు బిల్లుల మీద కూడా మమ్మల్ని ఎత్తిపొడిచారు. ఎత్తిపోతల కరెంటు బిల్లుల మీద జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసు. పాలమూరుకు పోతే సంతోషమేస్తోంది. నీళ్లను చూసి జనం ఎగిరి గంతేస్తున్నారు. రైతు రుణమాఫీ కూడా నిధులు కేటాయించాం. రైతులను రుణ విముక్తులను చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు.