మంత్రాల నెపంతో హత్య..నిందితులకు శిక్ష ఖరారు

కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ : మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులకు ఆసిఫాబాద్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2016లో కెరమెరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నగూడ గ్రామానికి చెందిన కుడిమేత పోగిగా అనే వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో హత్య చేశారు. ఈ కేసులో కుడిమేత గంగు, కుడిమేత చిన్ను, కుడిమేత రాము, ఆత్రం మారు, కుడిమేత అయ్యూబాయి, కుడిమేత గజ్జు భాయి నిందితులుగా ఉన్నారు.

పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 143,144,147,148,302,448,449,323,109, 307 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావు ఆసిఫాబాద్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. సాక్షులను విచారించిన మూడో అదనపు జడ్జి కే వెంకటేశ్వర్ నిందితుల్లో కుడిమేత గంగు, కుడిమేత రాముకు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 2500 రూపాయల జరిమానా విధించగా..కుడిమేత చిన్ను, ఆత్రం మారు, కుడిమేత అయ్యూభాయి, కుడిమేత గజ్జు భాయిలకు ఐదేండ్ల జైలుశిక్ష 2వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Related Stories: