ఏపీకి హోదా కుదరదు..ప్యాకేజీ ఇస్తాం: అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ వేదికగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్‌జైట్లీ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తగినంత రాబడి లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ర్టాలకు ప్రత్యేక హోదా ఇచ్చామన్నారు. ఈశాన్య రాష్ర్టాలకు 90: 10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇష్టం లేకుండానే రాష్ట్ర విభజన జరిగిందని, ప్రత్యేక హోదా అమలులో ఉన్నపుడు ఏపీ ఇస్తామని హామీనిచ్చారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే అంశం మనుగడలో లేదని అన్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ర్టాలు లేవని, ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ముఖ్యమైన అంశమని తెలిపారు. జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ర్టాలకు పంపిణీ జరుగుతుందన్నారు. రెవెన్యూ లోటు పూడ్చాలని ఏపీ విభజన చట్టంలో ఉంది. ఏపీకి 90:10 నిష్పత్తిలో నిధులు సమీకరించాలని నిర్ణయించినట్లు జైట్లీ పేర్కొన్నారు. ఏపీ తీసుకునే విదేశీ రుణాల్లో 90 శాతం కేంద్రమే చెల్లిస్తుందని, 90:10 నిష్పత్తికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోసం ఎస్సీవీ లాంటి సంస్థ ఏర్పాటు చేయాలని సూచించాం. ఆ సంస్థలో 90శాతం నిధులకు కేంద్రమే హామీ ఇస్తుంది. మేం ఇస్తామన్న వాటితో పోలిస్తే ప్రత్యేక హోదా వల్ల ఏపీకి వచ్చేది తక్కువగా ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. హోదాతో సమకూరే ప్రయోజనాలు ప్యాకేజీలో ఇవ్వడానికి నిరాకరించలేదు. 2014 నుంచి 2016 వరకు ఉన్న రెవెన్యూ లోటును లెక్కించండి. దానికి మరో 10 నెలలు అదనంగా లెక్కించండి. దాదాపు రూ.4వేల కోట్లు చెల్లించాం, ఇంకా అవసరమైన నిధులను చెల్లిస్తామని జైట్లీ వెల్లడించారు. ఇంకా రూ.138 కోట్ల రెవెన్యూ లోటు చెల్లించాల్సి ఉందన్నారు. మొత్తం నిధులు లెక్కలు చేసే ఓపిక ఉండాలి. రాజకీయ లాభాలతో నిధుల కేటాయింపు ఉండదన్నారు. కేంద్రానికి విపరీతంగా నిధులు వచ్చిపడట్లేదని, ప్రతీ రాష్ట్రం కూడా కేంద్రం నుంచి నిధులు పొందే హక్కుదారని జైట్లీ స్పష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా కింద వ‌చ్చే ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌నే.. ప్ర‌త్యేక ప్యాకేజీలో క‌ల్పిస్తున్నామ‌ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి ప‌ట్ల‌ త‌న‌కు సానుభూతి ఉంద‌ని, కానీ దాని ఆధారంగా నిధుల‌ను కేటాయించ‌లేమ‌న్నారు. మ‌నోభావాల‌ను బ‌ట్టి ఎంత నిధులు కేటాయించాల‌న్న అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేమ‌న్నారు. 14వ ఫైనాన్స్ క‌మీష‌న్ ఆధారంగా ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా అన్న కాన్సెప్ట్ లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదా అంటే 90-10 నిష్ప‌త్తిలో నిధులు ఉంటాయ‌ని, 60-40 నిష్ప‌త్తిలో కాద‌న్నారు.
× RELATED గతంలో నెరవేర్చిన విధంగానే ఈసారి కూడా: కేసీఆర్