సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లేఖ రాశారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం సహకరించినందుకుగాను సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. జూలై 1నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహకారంతోనే జీఎస్టీ బిల్లు తేగలిగామన్నారు. జీఎస్టీపై రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేకు అవగాహన సదస్సులు నిర్వహించాలని అరుణ్‌జైట్లీ కోరారు.
× RELATED శృంగారానికి ఒప్పుకోలేదని ట్రాన్స్‌జెండర్‌పై కాల్పులు