రాజ్యసభలో సభానాయకుడిగా రెండోసారి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో సభానాయకుడిగా మరోసారి ఎన్నికయ్యారు. సభానాయకుడిగా 65ఏళ్ల జైట్లీ పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఇటీవల ఆయన రాజ్యసభకు మళ్లీ ఎంపికైన విషయం తెలిసిందే. జైట్లీని రెండోసారి సభానాయకుడిగా నియమించినట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభలో చెప్పారు. మంగళవారం సమావేశం ప్రారంభంకాగానే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ నుంచి తనకు లేఖ వచ్చిందని.. రాజ్యసభ సభానాయకుడిగా అరుణ్ జైట్లీని భారత ప్రధాని నరేంద్రమోదీ నియమించారని ఛైర్మన్ వివరించారు. నూతనంగా, తిరిగి ఎన్నికైన 58 మంది సభ్యుల్లో 41 మంది ప్రమాణస్వీకారం చేశారు. జైట్లీ నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయలేదు. 2014, జూన్‌లో రాజ్యసభలో సభానాయకుడి అరుణ్ జైట్లీ నియమించబడ్డారు.
× RELATED 'రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్‌దే అధికారం'