అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు: అరుణ్‌జైట్లీ

హైదరాబాద్: అత్యాధునిక టెక్నాలజీతో ముందుకువెళ్లాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మిథానీ, బీడీఎల్ ప్రతినిధులకు సూచించారు. ఇవాళ పటాన్‌చెరులోని మిథాని, బీడీఎల్‌లో 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తోపాటు పలు కార్యక్రమాలను అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన మిస్సైల్, యుద్ధ ట్యాంకర్‌ను జైట్లీ రక్షణశాఖకు అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలు గల విద్యనందించాలన్నారు. భారత్‌లో సాంకేతిక జ్ఞానం కలిగిన మానవ వనరులు అధికమన్నారు. భారతీయులు విదేశాల్లోనూ తమ సేవలను అందిస్తున్నారని, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రక్షణ రంగంలోనూ వినియోగిస్తున్నారని తెలిపారు.
× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు