వేసవి దుక్కులకు వేళాయే

cultivation2 వానకాలం ప్రారంభం కాబోతున్నది. ఈ సమయంలో పంటవేసే ముందు వేసవి దుక్కులను దున్నుకోవాలి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు. వర్షాలకు ముందే భూమిని దున్నటం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కుల వల్ల భూమి పై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుం ది. దీంతో భూమిలో తేమశాతం పెరిగి, భూసార అభివృద్ధి, పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ తదితర ప్రయోజనాలున్నాయి.

భూసార వృద్ధి, తేమశాతం పెరుగుదలలో కీలకపాత్ర..

వేసవి దుక్కులు లోతుగా, వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవ డం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడు తాయి. దీంతోపాటు భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామ ర్థ్యం పెరుగుతుంది. దీని ప్రభావంతో పంట దిగుబడి మీద కేంద్రీకృతమవుతుంది. వేసవి దుక్కులు దున్నేముందు పొలంలో గొర్రెలను, పశువుల మంద లు తోలటంవల్ల అవి విసర్జించే వ్యర్థా లు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం తయారవుతుంది. ఇది భూసార వృద్ధి లో ఎంతగానో ఉపయోగపడుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందు పశువు ల పెంటపోగు, కంపోస్టు ఎరువు, చెరువులోని మట్టని వెదజల్లాలి. దీనివల్ల నేతల సారవంతమై పంట దిగుబడి పెరుగుతుంది. దీంతో పాటు తేమ శాతం పెరుగుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికందగానే పంటల నుంచి వచ్చే ఎండు ఆకులు, చెత్త, చెదా రం కాల్చివేయవద్దు. అవకాశం ఉంటే లోతు దుక్కులు దున్నడం వల్ల చెత్త, చెదారం, ఎండు ఆకులు నేల పొరల్లో కలిసిపోతాయి. ఇవి ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. దీనివల్ల పంటకు కావాల్సిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

పురుగులు, తెగుళ్ల నివారణ

ఎండాకాలంలో భూమి ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు పంటకోత దశల్లో వాటి నిద్రావస్థ దశలను నేలలో, చెత్తాచెదారంలో, కొయ్య కాడల్లో గడుపుతాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు తదితర భూమిలోపల ఆశ్రయం పొందుతాయి. లోతు దుక్కుల వల్ల నిద్రావస్త దశలో భూమిలో ఉన్న చీడ పురుగుల కోశాలు గుడ్లు, లార్వాలు, గుడ్లను పక్షులు, కొంగలు, కాకులు, తిని నాశనం చేస్తాయి. అదే విధంగా వేసవి దుక్కల వల్ల భూమిలోపల పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టితోపాటు నేలపైకి వస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు గురై వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోతాయి.

వేసవి దుక్కులతో కలుపు నిర్మూలన..

వేసవి దుక్కులను తయారుచేసుకోకపోతే కలుపు నివారణకు అదనపు భారం పడుతుంది. పంటలేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు నేలలోని నీరు, పోషకాలను గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అలాగే అనేక రకాల పురుగులకు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించటం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవి లోతుదుక్కుల వల్ల లోతుకు పాతుకుపోయిన కలుపు మొక్కలు వాటి విత్తనాలు నేలపై పొరల్లోకి చేరటం వల్ల అధిక ఉష్ణోగ్రతకు గురై నశిస్తాయి. దీనివల్ల తదుపరి పంటలో కలుపుతాకిడి తక్కువగా ఉంటుంది. రైతుకు కూలీల ఖర్చులూ తగ్గే అవకాశం ఉంటుంది. -మద్దెల లక్ష్మణ్, 9010723131, ఖమ్మం వ్యవసాయం r-srinivas-rao

అనేక ప్రయోజనాలు

సీజన్‌కు ముందుగానే వేసవి దుక్కులను తయారు చేసుకోవాలి. దీనివల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అలాగే భూసారం పెరుగుతుంది. పురుగులు, తెగుళ్ల నివారణకు వేసవి దుక్కులు ఉపయోగకరంగా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైనది కలుపు నివారణ ముందస్తుగానే దుక్కులను దున్నుకోవడం వలల్ల కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు. తద్వారా పెట్టుబడి భారం తగ్గుతుంది. - డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు, ఖమ్మం ఏరువాక శాస్త్రవేత్త, 7893034800