హరితగృహాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

haritha-gruham ఎండాకాలంలో హరితగృహాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. బైటి వాతావరణం కంటే చాలా డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ. చాలా హరితగృహాల పంటల్లో రాత్రి ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ దాటితే పరాగ సంపర్కం తక్కువగా ఉంటుంది. పూత, కాత రాలుతుంది. కాబట్టి కచ్చితంగా నీడ కల్పించటం, వెంటిలేషన్, తేమ శాతం పెంచటంతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. వెంటిలేషన్ పెంచటం ప్రధానమైంది. వేడిని తగ్గించడంలో ప్రధాన చిట్కా ఇది. హరితగృహం తలుపులు, పక్క వెంట్‌లను పాక్షికంగా తెరువటంతో చల్లని గాలి హరితగృహాల్లో వేడెక్కిన మొక్కలకు అందుతుంది. రూప్ వెంట్ విస్తీర్ణం నేల విస్తీర్ణంలో 20 శాతమంటే రెండు నిమిషాల్లో హరితగృహమంతా తాజా గాలితో నిండుతుంది. చాలా హరితగృహాల్లో ఇది సరిపోతుంది. అయితే పక్క వెంట్‌లు, తలుపులు కూడా పాక్షికంగా తెరిస్తే పూర్తి చల్లదనం మొక్కలకు వస్తుంది. 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటితే మొక్కలు దెబ్బతింటాయి. దీన్ని గమనించటానికి గరిష్ఠ-కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు చేసే థర్మామీటర్ ఉంచాలి. అధిక వేడి రోజుల్లో అన్ని ద్వారాలు తెరిచిపెట్టి పిల్లులు, కుక్కలు రాకుండా వలలు అమర్చాలి.

నీడ కల్పించడం

సులభమైన, త్వరితగతిన వేడిన తగ్గించే ఉపాయం హరితగృహానికి నీడ కల్పించటం. పెయింట్‌లు వేయడం ద్వారా నీడను ఏర్పాటు చేయవచ్చు. హరితగృహం బైట, లోపల పెయింట్ వేసే వీలుంది. బ్లెండర్స్ అంటే ఇవి నీడను పై పాటుగా కల్పించేందుకు ఉపయోగపడే సాధనాలు. బైట, లోపల వీటిని వాడే వీలుంది. హరితగృహం బైట పైపాటుగా ఉంచితే అవి గ్లాసు నుంచి సూర్యరశ్మిని లోపలకు చొరబడకుండా చేసి, లోపల వేడిమిని పెంచవు. చల్లని వాతావరణం ఉన్న రోజుల్లో వీటిని తీసివేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సూర్యరశ్మి తీవ్రత తగ్గించాలంటే లోపలి బ్లెండర్స్ వాడాలి. నీడనిచ్చే వైర్ మెష్‌లు లేదా షేడ్ సెంట్‌లు చాలా తక్కువ ధరలో ైబ్లెండర్స్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. haritha-gruham2 మరో మార్గం-హరితగృహాల్లోని దారులు, ఇతర గట్టి ప్రాంతాల్లో నీటితో తడుపడం ద్వారా గాలిలో తేమ పెంచటం. నీరు ఆవిరయ్యే కొద్దీ గాలిలో తేమ పెరుగుతుంది. దాంతో మొక్కల్లో తగ్గించే ఎర్రసాలీడు, నల్లి ఉధృతి సైతం తగ్గుతుంది. ఉదయం ఒకసారి, సాయంత్రం మరోసారి నీటి తడి పెడితే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోను మొక్కల వేరు ప్రాంతంలో నీటి తేమ ఎప్పుడూ ఉండేటట్లు చూసుకోవాలి. మొక్కల ఆకుల భాగం నుంచి కోల్పోతున్న భాష్పోత్సేక నీటిని తిరిగి పొందేలా తరచుగా నీటి తడులిల్వాలి. మొక్కలు వడలిపోయే లక్షణాలు, ఆకులు ముడుచుకునే లక్షణాలు, లేతగా ఏర్పడే ఆకులు ఎండిపోయే లక్షణాలు ఎట్టి పరిస్థితుల్లోను రాకుండా చూడాలి. నీడనిచ్చే క్లాత్ వాడటంతో హరితగృహాల్లో 30-90 శాతం వరకు సూర్యరశ్మి తీవ్రతను తగ్గించవచ్చు. చాలా హరితగృహాల మొక్కలకు 40-50 శాతం నీడ సరిపోతుంది. నల్లని రంగు షేడ్ క్లాత్‌లు వాడాలి. పెద్ద పరిమాణంలో ఉన్న నీటి డబ్బాలు, తొట్లు వాడటం వల్ల అవి అధిక వేడిని గ్రహిస్తాయి. చాలా మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ 21-22 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. 21-22 డిగ్రీల ఉష్ణోగ్రత మిరపకు పనికి వస్తుంది. పూత, కాత ఏర్పడటానికి సరాసరిన రాత్రి ఉష్ణోగ్రత 16-18 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. 14 డిగ్రీల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండాలి. అలాగే వేరు ప్రాంతంలో 18-21 డిగ్రీల ఉష్ణోగ్రత కచ్చితంగా ఉండాలి. 23 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. మొక్కల వేర్ల ఉష్ణోగ్రత 24-25 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గకుండా నీరు, పోషకాలు అందించాలి. గాలిలో తేమ 80 శాతం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత పైనే తేమను నిలుపుకునే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. 20 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీటి నిల్వ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ గాలిలో తేమ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. చలికాలం పంటలకు 21 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రత, 32 డిగ్రీల సెల్సియస్, ఉష్ణ మండలపు పంటలకు సరాసరిన అవసరం. హరితగృహాల్లో మబ్బుల రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతల కంటే 2.8 నుంచి 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ మించి ఉండరాదు. అదే సాధారణ రోజుల్లో అయితే 15 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మొక్కలను నీటితో తడుపరాదు. వేసవిలో నీటి లవణాలు అధికమవడం వల్ల ఆకులు, పూలు మాడిపోయే అవకాశాలు ఎక్కువ. ఎండాకాలంలో సుడిగాలులు అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పాలీహౌజ్ రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. సుడిగాలులు వచ్చే సూచనలు ఉన్నప్పుడు ప్లాస్టిక్ రోలర్ ఫిల్మ్ నలువైపులా అడుగు ఎత్తు తెరిచి ఉంచటం ద్వారా గాలి సులభంగా లోపలి నుంచి కూడా బైటకు పోయే వీలు ఉంటుంది. -పూలు, కూరగాయలు పండించే పాలీహౌజ్‌లలో ఎటువంటి పరిస్థితుల్లో బెడ్స్‌పై మట్టి కదిలించవద్దు. వేర్లు కదిలితే మొక్కల పెరుగుదల కనిపించదు. -పాలీహౌజ్ పై భాగంతో ఏర్పర్చిన షేడ్‌నెట్‌లను రాత్రిళ్లు పూర్తిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల రాత్రిళ్లు వీచే చల్లని గాలితో పాలీహౌజ్ లోపల వాతావరణం చల్లని గాలితో చల్లబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో రాత్రిళ్లు పాలిహౌజ్ మూయవద్దు. -ఉష్ణోగ్రతల పెరుగుదలను అనుసరించి పాలీహౌజ్ పైభాగంలో ఏర్పర్చుకొన్ని షేడ్‌నెట్‌ను ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తిగా మూసివేయాలి. దీనివల్ల లోపలికి వెలుతురు ప్రసరణ 50 శాతం వరకు తగ్గుతుంది. -కార్నేషన్ పూల సాగులో ఏ సమయంలోనైనా మొక్కకు ఒక కొమ్మ లేక రెండు చిగుర్లు వచ్చి ఉండాలి. చిగుర్లు లేకుండా ప్రతి కొమ్మను కత్తిరించినప్పుడు 100 శాతం మొక్కలు చనిపోతాయి. అందువల్ల పూతకోతలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. -కార్నేషన్ పూలు పెంచేమ రైతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 1 1/2 పించింగ్ చేయవద్దు. ఎందుకంటే మనకు లభ్యయయ్యే రకాలు మన వాతావరణ పరిస్థితుల్లో 1 1/2 పించింగ్‌కు సహకరించటం లేదు. -సూరం సింధూజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ -ఎ. నిర్మల, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యాన కళాశాల, రాజేంద్రనగర్ haritha-gruham3