సిరుల పంట

crop హవేళిఘణపూర్: ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా రాష్ట్ర ఆదాయం పెంచి సీఎం కేసీఆర్ ప్రశంసలు పొందారు. ఇటీవల రైతులు కేవలం నీరు అధికంగా అవసరమయ్యే వరి పంటలను మాత్రమే సాగు చేయడం పరిపాటి. ఈక్రమంలో సుభాష్‌రెడ్డి ఆరుతడి పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన స్వగ్రామం హవేళిఘణపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామంలో తనకున్న మూడెకరాల పొలంలో ఆరుతడి పంటలనే సాగు చేసేందుకు నిర్ణయించారు. ఆలుగడ్డ సాగు కోసం విత్తనాన్ని ఆగ్రా నుంచి తెప్పించి సాగు చేశారు. డ్రిప్‌ను వినియోగించి తక్కువ నీటితో సాగు చేస్తున్నారు. potato ఎకరాకు 25వేల వరకు పెట్టుబడి ఖర్చు కాగా, రూ.70 నుంచి రూ.80వేల లాభం వచ్చినట్లు శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్త క్రాప్ట్ కాలనీలు ఏర్పాటు చేసేందుకు గాను సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తన వంతుగా ఆరుతడి పంటల సాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు. డ్రిప్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు రైతులు వచ్చి ఆలుగడ్డ సాగు చేస్తున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. s-subhash-reddy-mlc

సీఎం ఆశయాలకు అనుగుణంగా..

సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తన పొలంలో తక్కువ నీటితో ఎక్కువ పంటలను సాగు చేస్తున్నారు. దీనిద్వారా దిగుబడి వస్తుందన్న విషయాన్ని గుర్తించాను. ఆ దిశగా ప్రతీ రైతు అడుగులు వేస్తే రాష్ట్రంలోని రైతులకు మంచి దిగుబడులు వస్తాయి. వరి, మక్కజొన్న తదితర పంటలను సాగు చేయడం ద్వారా నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. దీంతో నీరంద క ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రైతులు నీటిని ఆదా చేసుకునేందుకు ప్రభుత్వం 90శాతం సబ్సిడీపై అందజేస్తున్న డ్రిప్‌ను వినియోగించుకోవాలి. పంటల మార్పు ద్వారా రైతులకు అనేక లాభాలుంటాయి. కాబట్టి రైతులు ప్రతీసారి ఒకే పంట కాకుండా పంటల మార్పు చేయాలని రైతులకు సూచించారు. - శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ naga-madhuri

ఆరుతడి పంటలకు పూర్తి సహకారం

మండలంలోని రైతులు ఎవరైనా ఆరుతడి పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తే వారికి సలహాలు, సూచనలు చేసి రైతులు మంచి దిగుబడి పొందేందుకు సహకరిస్తాము. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోతున్న క్రమంలో రైతులు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలని ఆమె కోరారు. అంతేకాకుండా ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న డ్రిప్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. - నాగమాధురి,మండల వ్యవసాయ అధికారి