బత్తాయితోటల్లో సస్యరక్షణ

batthai ఎండాకాలంలో నీటిఎద్దడి ఉంటుంది. దీని వల్ల బత్తాయి సాగుచేసే అన్ని ప్రాంతాల్లోని రైతులు బత్తాయి చెట్లకు సరిపడా నీటిని అందించడం సాధ్యం కాదు. దీంతో ఆశించినస్థాయిలో దిగుబడి సాధించలేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. రైతులు తోటల్లో వేయించిన బోర్లలో సరిపడా నీరు లేకపో తే బత్తాయి చెట్లకు నీరు అందక చెట్లు ఒత్తిడికి గురై వేరుకుళ్ళు తెగులు సోకి చెట్లు చనిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఎండాకాలంలో రైతులు నీటియాజమాన్య పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారించాలి. లేత బత్తాయి చెట్లకు ఎండాకాలంలో రోజుకు 4-16 లీటర్ల నీరు అవసరం. కాపు దశలో వున్న చెట్లకు 120-140 లీటర్ల నీరు తప్పనిసరిగా అందించినప్పుడే చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. తోటల్లో అమర్చిన డ్రిప్‌ల ద్వారా ఎండాకాలంలో చెట్లకు సరిపడా నీరు అందించడం సాధ్యం కాదు. పైపుల ద్వారా నీటిని అందించడం వల్ల నీరు అంతా వృథా అయిపోతుంది. కాబట్టి రైతులు ఎండాకాలం బత్తాయిచెట్లకు నీటిని అందించడానికి మల్చింగ్ పద్ధతిని అనుసరించాలి. రైతులు పైపుల ద్వారా చెట్లకు నీటి తడిని కట్టేటప్పుడు డబుల్ రింగ్ చేసి చెట్టు మొదలుకు తడి తగులకుడా జాగ్రత్త తీసుకోవాలి.

batthai2

పాదుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బత్తాయి చెట్లకు నీటిని కట్టేటప్పుడు పాదుల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. చెట్టు మొదలుకు తడి తగులకుండా జాగ్రత్తపడాలి. చెట్టు మొదలుకు తడి తగిలితే చెట్టు మొత్తానికి బంకతెగులు సోకే ప్రమాదం ఉన్న ది. పాదుల్లో వరి ఊక, ఎండుగడ్డి వేయడం వల్ల పాదుల్లో పదును ఆరిపోకుండా తేమ నిల్వ ఉంటుంది. అంతేకాకుండా పాదుల్లో పచ్చిరొట్టె గింజలు, జనుము, జీలుగు, పిల్లిపెసర చల్లినట్లయితే కలుపును అరికట్టవచ్చును. అంతేకాకుండా ఇవి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతాయి.

సస్యరక్షణ

లేటుగా కాసిన బత్తాయికాయలు చిన్నసైజులో ఉంటే కాయలకు మంగు వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి రైతులు ముందుగానే దీన్ని గమనించి కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు మంగును నివారించడానికి ఇథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి లేదా ప్రొపార్‌గేట్ 2 మిల్లీ లీటర్లు లీటరు నీటికి లేదా దీర్ఘకాలం నల్లిని నివారించే ఫెనాజాక్విన్ 1 మిల్లీ లీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

సూక్ష్మధాతు లోపాల సవరణ

బత్తాయి తోటల్లో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తే వెంటనే జింక్‌సల్ఫేట్ 5 గ్రా ఒక లీటరు నీటికి, మెగ్నిషియం సల్ఫేట్ 2 గ్రా ఒక లీటరు నీటికి, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రా ఒక లీటరు నీటికి, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రా ఒక లీటరు నీటికి, బోరాక్స్ 1 గ్రా ఒక లీటరు నీటికి, సున్నం 6 గ్రా ఒక లీటరు నీటికి, యూరియా 10 గ్రా ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రైతులు ఈ సూచనలను పాటించడం ద్వారా ఎండాకాలంలో బత్తాయి తోటలను సంరక్షించుకోవడమే గాక అధిక దిగుబడులు సాధించవచ్చు. -నగిరి హరీశ్, త్రిపురారం

తగిన జాగ్రత్తలు పాటించాలి

బత్తాయి సాగుచేసే రైతులు ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో నీటి ఎద్దడి చాలా ఉంటుంది. కాబట్టి రైతులు తగిన నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలి. దీనివల్ల ఎండాకాలంలో చెట్లు ఎండిపోకుండా, ఎలాంటి తెగుళ్లు సోకకాకుండా కాపాడుకోవచ్చు. parvathi-chauhan -పార్వతీచౌహన్, మండల వ్యవసాయశాఖాధికారి, త్రిపురారం

More in రైతుబ‌డి :