ఆరోగ్యానికి.. ఆర్థికానికి అండ

రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి వాతావరణంలో మనో వికాసానికి, అదనపు ఆదాయానికి ఆసరాగా బోన్సాయ్ మొక్కల పెంపు తోడ్పడుతుంది. Bonsai -చైనా దేశంలో పురుడుపోసుకున్న బోన్సాయ్ కళ, జపాన్ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. మనసును, మొక్కలను ప్రకృతిని ఏకం చేసే విశిష్ట ప్రక్రియ ఇది. -మానసిక ఆరోగ్యానికి పెంపొందించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో బోన్సా య్ మొక్కల పెంపకం ఇతోధికంగా ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. -అందుకే అనాథ శరణాలయాలు, జైళ్లు, స్కూళ్లు, కళాశాలలు, పరిశ్రమల ప్రాంగణాల్లో బోన్సాయ్ మొక్కలు ఏర్పాటు చేయాలన్న సిఫార్సులు ఉన్నాయి. -బోన్సాయ్ అనేది ఒక కళ. దాదాపు అన్నిరకాల మొక్కలను బోన్సాయ్ పద్ధతిలో శిక్షణ ఇవ్వవచ్చు. -అనుకున్న ఆకృతిలో, ఎత్తులో బోన్సాయ్ మొక్కలు తయారు చేసుకోవచ్చు. -పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కలప మొక్కలలో ఎక్కువగా బోన్సాయ్ కళ వాడుతున్నారు. -కేవలం మూడు నెలల పాటు చిన్న శిక్షణతో బోన్సాయ్ మొక్కల పెంపకం నేర్చుకోవచ్చు. మహిళలు, గృహిణులు తమ ఇంటివద్దే కొద్దిపాటి స్థలంలో బోన్సాయ్ మొక్కలు తయారుచేసి విక్రయించుకోవచ్చు. అదనపు ఆదాయం సంపాదించవచ్చు. -రైతుబడి డెస్క్

More in రైతుబ‌డి :