మిద్దెతోట మాంత్రికుడు

అసలు ఒక మనిషికి,ఒక కుటుంబానికి ఏం కావాలి, ఎంత కావాలి. దీనికి సమాధానమే రఘోత్తమరెడ్డి మిద్దెతోట అనుభవం.
తుమ్మేటి రఘోత్తవ్‌ురెడ్డి నారపల్లిలోఎనిమిదేండ్లకు పైబడి సాగు చేస్తున్న టెర్రస్ గార్డెన్‌ను చూడటానికి మొదటిసారి వెళ్లి నప్పుడు ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. ఎప్పుడూ ఏవో శబ్దాలతో, తెలియని అభద్రతతో ఉండే నగర జీవితంలో ఈ ఆకుపచ్చని మిద్దెతోట మినీ అడవిలా దర్శనమిచ్చింది. ఒక కుక్క (గూఫీ), పిల్లి, టెర్రకోట మట్టిబొమ్మలు, వాటిని అందంగా అల్లుకున్న బచ్చలి తీగలు,రకరకాల రంగుల పూలు,తీగజాతులు, కూరగాయలు, పండ్లచెట్లు, కిలకిలలాడుతున్న పిట్టలు..వీటన్నిటి మధ్య మౌనంగా, ఒక రుషిలా పనిచేసుకుంటున్న రఘోత్తవ్‌ు పూవు పూవునూ, కాయ కాయనూ ప్రేమగా పలకరిస్తూ, ఆకులో ఆకై, పూవులో పూవై, ప్రకృతితో మమేకమై జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్న ప్రాకృతిక మానవునిలా కనిపించారు. terrace-garden రఘోత్తవ్‌ురెడ్డి మిద్దెతోట నిర్మించుకోవడానికి అస లు కారణం, తనను ఎప్పుడూ నిటారుగా నిలబెట్టిన బలమైన ప్రాపంచిక దృక్పథం, ప్రకృతితో ముడిపడిన పేగుబంధం. ఏ మట్టి మూలాల నుంచి వచ్చాడో దాని పరిమళాన్ని మనసులోనే పదిలపరుచుకున్నారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన రఘోత్తవ్‌ు రెడ్డి తన కళ్లముందే వ్యవసాయంలోకి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ రంగప్రవేశం చేయడం చూశారు. స్వతహాగాతాను కూడా రైతు కుటుంబం నుంచే రావడం వల్ల పంట ల మీద ఎన్ని రసాయనాలు వాడుతారో అనుభవంలోకి వచ్చింది. దీంతో తాము ఇంట్లో తినే కూరగాయల బయటినుంచి కొనకూడదని నిర్ణయించుకున్నారు. ఇరువై ఏడేండ్ల పాటు సింగరేణిలో ఉద్యోగం చేసినపుడు కూడా తమ ఇంటికి కావలసిన కూరగాయలను తమ పెరటిలోనే పెంచుకున్నారు. 13 ఏండ్ల ముందుగానే, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి హైదరాబాద్ వచ్చాక స్థలాభావం వల్ల ఇంటిపై మిద్దె తోటను నిర్మించుకున్నారు.

రఘోత్తవ్‌ు రెడ్డి ఇంటి అడుగు స్థలం పొడవు 40 అడుగులు, వెడల్పు 36 అడుగులు. మొత్తం 163 గజాలు. రూఫ్ ఏరియా 1240స్వ్కేర్ ఫీట్లు. ఈ రూఫ్ ఏరియాను ఉపయోగించుకుని, తన కుటుంబానికి రోజువారీగా ఏది అవసరమో అది పండించుకుంటున్నారు. మొదట వాడి పారేసిన కూలర్ల అడుగు భాగాలతో కొన్ని మడులు, రెండు వరుసల ఇటుకలతో కొన్ని మడులు నిర్మించుకుని, మట్టి, పశువుల ఎరువు నింపి కూరగాయలు పండించా రు. ప్రధానంగా ఇంటి పైకప్పు దెబ్బ తినకుండా, బీవ్‌‌సు-కాలవ్‌‌సు పైకి వచ్చేలా 4-4 అడుగుల పొడవు, వెడల్పు లు, 1 అడుగు లోతు ఉన్న ఇటుకల మడులను నిర్మించుకుని, తోటను నెమ్మదిగా విస్తరించారు.

వీటిలో రామములగ, బెండ, కాకర, బీర, సొర, చెమ్మ, చేమగడ్డ, పాలకూ ర, తోటకూర, బచ్చలికూర లాంటి కూరగాయలతో పాటు, దానిమ్మ, బొప్పాయి, వాటర్ ఆపిల్, అంజీర, పంపర పనస, జామ వంటి పలురకాల పండ్లను కూడా పండిస్తున్నారు. వీటితోపాటు బంతి, గోరింట, గులాబీ, మందార, రుద్రాక్ష లాంటి ఎన్నోరకాల పూలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం తన తోటలో శాశ్వత మడుల నిర్మాణంలో భాగంగా వివిధ సైజుల ఫైబర్ టబ్బులను వాడుతున్నారు. మిద్దెతోటలో మొక్కలకు చీడపీడలు సోకి తే, ఆకులను తుంచడం, పురుగులను చేతితో ఏరివేయడమే సరైన మార్గం అంటారు.

bitter-gourd రోజూ ఇంటికి ఏది కావాలో అది అప్పటికప్పుడు తాజా గా, ఆరోగ్యంగా తెచ్చుకుని వండుకోవడం కంటే ఆనం దం ఇంకేముంటుంది అంటారాయన. మిద్దెతోట కేవలం ఆరోగ్యమే కాదు, శారీరక వ్యాయామం, మానసిక ఆనందం అని ఆయన నమ్మిక. రఘోత్తవ్‌ు కేవలం మిద్దె మీద పంటలు పండించడం అనే పనికే పరిమితం కాకుండా, ఒక బలమైన సామాజిక దృక్పథంతో, తన ఆచరణ ఎంతో మందికి స్ఫూర్తి కలిగించాలనే తపనతో,శ్రమను, సృజనను కలగలిపి ఇంటి మీద ఒక ఆకుపచ్చని ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. ఒక ప్రకృతి ప్రేమికునిలా, శ్రామికునిలా, సైనికునిలా పలురూపాల్లో తన పనితో ఎదుటి మనిషి హృదయపు కిటికీలకు పందిరిలా అల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మిద్దెతోటను గత మూడేండ్లలో దాదాపు వెయ్యిమంది సందర్శించారు.

అందులో 566మంది అభిప్రాయాలను రికార్డ్ చేశారు. ఆయన తన ఎనిమిదేండ్ల మిద్దెతోట అనుభవాలను ఇంటిపంట పేరుతో పుస్తకంగా రాశారు. దీన్ని నేచర్స్ వాయిస్ సంస్థ ప్రచురించింది. మరో పుస్తకాన్ని మిద్దెతోట పేరుతో రైతునేస్తం పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ ఎనిమిదేండ్లలోఒక్క ఆయన ఇంటి మీద నుంచే సుమారు 4 టన్నుల కూరగాయలు, రెండు పుస్తకాలు, వివిధ ఛానళ్లలో 60కి పైగా వీడియోలు వచ్చాయంటే, మరి ఇన్ని లక్షల డాబాల నుంచి ఎన్ని ఉత్పత్తులు వస్తాయో, ఉప ఉత్పత్తులు వస్తాయో ఆలోచిస్తే అద్భుతం అనిపిస్తుంది. ఆహార, ఆరో గ్య భద్రతకు భరోసా దక్కుతుందనే ఆలోచనా కలుగుతుంది.

మిద్దెతోటలో మునగ చెట్టు

మునగతో మూడు వందలకు పైగా ప్రయోజనాలున్నాయని అంచనా. మునగ ఆకును, పూలను,కాయలను వంటతో పాటు ఆయుర్వేదంలో రకరకాలుగా వాడుతున్నారు. మునగ ఆకును కరివేపాకులా కూరల్లో వా డుకోవచ్చు. మహిళల్లో రక్తహీనతకు మునగ ఆకు ఒక పరిష్కారం. రఘోత్తవ్‌ురెడ్డి తన ఇంటి మీద మునగను ఆరునెలల నుంచి పెంచుతున్నారు. 2X2X2 సైజు వాటర్ కూలర్ అడుగు భాగానికి చుట్టూ రెండు వరసల ఇటుకలను పేర్చి అందులో మట్టి, ఎరువు నింపి, మునగను పెంచుతున్నారు.

మునగ తొందరగా కాపునకు వస్తుంది. తోటలో మునగచెట్టు ఉంటే ఒక కాయగూర,ఒక ఆకుకూర ఉన్నట్టు. చెట్టును గుబురుగా పెంచుకోవాలి. ప్రతి ఫీటుకు కొమ్మల చివరలను తుంచాలి. తుంచిన చోట,తిరిగి రెండు చివుళ్ల వస్తాయి. అలా ఎప్పుడూ చేస్తూ ఉండాలి. దానివల్ల చెట్టు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. లేనట్లయితే చెట్టు నిటారుగా పెరుగుతుంది. విరిగిపోయే అవకాశాలు ఏర్పడుతాయి. చెట్లు చిన్నగా ఉన్నప్పుడు పూత ను కూడా తుంచెయ్యాలి. లేకపోతే చెట్టు ఎదగదు. కనీ సం ఆరేడు నెలలు పూతను తెంచడం వల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. అలా ఎదిగాక పూలను ఉంచాలి. ఒకసారి నాటితే చాలా సంవత్సరాలు ఉంటుంది.

మెంతి ముచ్చట్లు

అధిక నీరు, అధిక వేడి నుంచి కాపాడుకోగలితే మూడుకాలాలలోను పండించుకోవచ్చు. మెంతి విత్తనాలను నేరుగా విత్తుకోవడమే. నారుపోసి, పెరికి, తిరిగి నాటుకోవడం ఉండదు. ఇందుకోసం రెండడుగుల పొడవు వెడ ల్పు ఉన్న మడి చాలు. అలాంటి మడులు మూడింటినిమెంతికి కేటాయించాలి. ఒక మడిని అలికిన నెలరోజులకుమరో మడిని అలుక్కోవాలి. మొదటి మడి ఆకులు అయిపోయేలోపు రెండో మడిలో పెరిగిన ఆకు అందుబాటులోకి వస్తుంది. మెంతులను ఆకుల కోసం అయితే చిక్కగానూ,మెంతులను పండించడం కోసం అయితే పలుచగాను అలుక్కోవాలి. ఇది చాలా స్వల్ప కాలపు పంట. 90 రోజుల్లో అయిపోతుంది.

కొత్తిమీర సాగు

కొత్తిమీర పండించడానికి ధనియాలను ముందుగా పప్పు గా చేసుకోవాలి. మన కాలిచెప్పుతో గచ్చుపై వేసి ధనియాలను రాస్తే పప్పు అవుతుంది. మన వంటింటి అవసరాలకు సరిపడేలా విత్తుకుంటే సరిపోతుంది. సాధారణంగా ధనియాలు మొలవలేదు అని కంప్లయింట్ ఉంటుంది. ధనియాలను విత్తుకోబోయే ముందే కొన్నింటిని శాంపిల్‌గా విత్తుకోవాలి. ధనియాలు విత్తిన తరువాత 9-10 రోజులకు మొలుస్తాయి. మనం అలికిన విత్తనాలలోంచి ఎంత శాతం మొలిచాయి,ఎంత శాతం మొలవలేదు తెలుస్తుంది. లేదా అసలే మొలవకపోవడం కూడా తెలుస్తుంది. మనం ధనియాలను విత్తనషాపుల్లో కొనేముందు ఇవి మొలుస్తాయా లేదా అడిగి తెలుసుకోవాలి. ప్రతీ విత్తనానికి నిద్రావస్థదశ,మొలకెత్తే దశ, మృత దశ ఉంటాయి. ఇది అన్ని రకాల విత్తనాలకు వర్తిస్తుంది -కె.క్రాంతికుమార్ రెడ్డి నేచర్స్ వాయిస్

మిద్దెతోటదారులకు సలహాలు.. సూచనలు

-దేశీ విత్తనాలు వాడితే మంచిది. ఇవి తెగుళ్లను,చీడపీడలను తట్టుకుంటాయి. -మిద్దెతోటను ఒకేసారి కాకుండా,అంచెలంచెలుగా విస్తరించుకోవాలి. -ప్రతిరోజూ తోటను ఊడ్చుకోవాలి. ఆకులను మల్చింగ్‌గా గాని,కంపోస్ట్ గుంతలో గాని వేయాలి. -ఏ నారునైనా సాయంత్రం వేళల్లోనే నాటుకోవాలి. ఫలితంగా మొక్కలు బాగా వేళ్లూనుకుంటాయి. -వాతావరణం తీవ్రంగా దశలో ఏ విత్తనాలూ నాటకూడదు. -మిద్దెతోటల్లో మొక్క రకాన్ని బట్టి రోజుకు 4-6 గంటలు సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. -మొక్కలకు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నీరు పెట్టాలి. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉన్నప్పుడు పెట్టకూడదు. -ప్రతి పంట మొదటి దశలోనే రెండు కాయలను విత్తనానికి వదలాలి. పంట చివరి దశకి వచ్చేలోగా విత్తనపు కాయలు ఎండుతాయి. t-reddy

More in రైతుబ‌డి :