అరటి సాగు లాభదాయకం

banana ఇల్లందకుంట: వ్యవసాయ బావుల్లో నీరు తక్కువగా ఉన్న రైతులు వరి, మక్క, పత్తి పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. ఇల్లందకుంట మండలంలో రైతులు అరటి పంట సాగు చేస్తున్నారు. అరటి సాగులో చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. దీంతోపాటు నీటి వాడకం కూడా ఎక్కువగా ఉండదు. దీంతో ఈ పంట సాగు చేపట్ట డానికి రైతులు ఆసక్తి చూపెడుతున్నారు. raw-banana ఇల్లందకుంట మండలంలోని సీతంపేట, బూజూనూర్, గడ్డివాణిపల్లి, సిరిసేడు ,రాచపల్లి గ్రామాల్లో 80 ఎకరాలల్లో రైతులు అధికంగా అరటి సాగు చేస్తున్నారు. అరటి సాగు చేట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చే దాకా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మంచి దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఎకరానికి రూ.40 వేల పెట్టుబడి పెడుతున్నారు. ఏడాదికి లక్షకు పైగా సంపాదిస్తున్నారు. ఒక్కసారి పంట సాగు చేస్తే రెండుసార్లు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. మొదటి పంట 11నెలలు, రెండో పంట మరో 8నెలల్లో చేతికి అందుతుంది. ఇతర పంట సాగు కంటే అరటిలో చీడపీడల బెడద తక్కువ. వరి, మక్క, పత్తి పంటలకు ఎక్కువ క్రిమిసంహారక మందులను వాడుతున్నారు. కానీ, అరటి సాగులో సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నిపుణుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే రైతులు అరటి గెలలను విక్రయించడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ల డానికి రవాణా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్ సౌకర్యం కల్పిస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

మార్కెట్ సౌకర్యం కల్పించాలి

అరటి సాగు చేసుకుంటున్న రైతులకు జమ్మి కుంటలో మార్కెట్ ఏర్పాటు చేయాలి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మండల రైతులు అరటి సాగు చేస్తున్నారు. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. t-bapanna -తెడ్ల బాబన్న, రైతు, సీతంపేట

మరింత మేలు

గత ఎనిమిదేండ్లుగా అరటి పంట సాగు చేస్తున్నాం. ప్రభుత్వం వరి, మక్క, పత్తి,మిర్చి పంటలను కొనుగోలు చేయడానికి మార్కెట్ ఏర్పా టు చేసింది. అట్లనే అరటి గెలల కొనుగోలు కోసం మార్కెట్ ఏర్పా టు చేస్తే మాకు మరింత మేలు జరుగుతుంది. o-rajaiah -ఒక్కతట్ల రాజయ్య, రైతు, బూజూనూర్

More in రైతుబ‌డి :