పోషక, ఔషధ విలువల గని

drumstick దేశంలో వంటకు ఉపయోగపడుతున్న మునగ పుష్కలమైన పోషకాలు, ఔషధ విలువలతో ఆరోగ్య రక్షణగా పనిచేస్తుంది. అపరిమితమైన ఖనిజ లవణాలు, మాం సకృత్తులు, యాంటీయాక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఇటీవల కాలంలో కాయలను మించి ఆకులలో అద్భుమైన పోషక విలువలు ఉన్నాయి పరిశోధనలు తెలుపుతున్నాయి. 75.9 శాతం తేమ, 6.7 శాతం ప్రోటీన్, 1.7 శాతం కొవ్వు, 0.9 శాతం ఫైబర్, 2.3 శాతం ఖని జ లవణాలు, 12.57 పిండిపదార్థాలు, 440 మిల్లీగ్రాముల కాల్షియం, 70 మిల్లీగ్రాముల పాస్పరస్, 7 మిల్లీగ్రాముల ఇనుము, 220 మిల్లీ గ్రాముల విటమిన్ సీ, విటమిన్ బీ కాంప్లెక్స్ ఇందులో ఉంటాయి. 92 క్యాల రీ విలువ కలిగి ఉంటుంది. పండ్లు, కూరగాయాలు, పాల కంటే అధికంగా మాంసకృత్తులు, ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది. రోజూ ఆహారంలో ఏదో ఒకరూపంలో తీసుకుంటే రక్తహీనత, అజీర్ణం, మూత్ర సంబంధిత వ్యాధుల సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి.

అలాగే 92 రకాల విటమిన్లు, 46 రకాల యాంటీయాక్సిడెంట్లు, 18 రకాల అమైనో యాసిడ్లు, 36 రకాల పెయిన్ కిల్లర్స్ ఇందులో కలవు. వీటిలో ఉండే విటమిన్ సీ ఆరెంజ్‌లో లభించేదానికంటే ఎక్కువగా విటమిన్ ఏ లభించే క్యారెట్, పాల కంటే అధికంగా ఇందులో లభిస్తున్నాయి. పొటాషియం, ప్రోటీన్లు అరటి, గుడ్లలలో కంటే అధికంగా ఉంటాయి. అలాగే ఐరన్ ఆకుకూరల కంటే అధికంగా ఉంటాయి. ఒక చెంచా ఆకు పౌడర్‌లో 14శాతం ప్రోటీను, నలభై శాతం కాల్షియం, 23 శాతం ఐరన్ ఉంటాయి. పసిపిల్లలకు అవసరమయ్యే విటమిన్లు ఒక స్పూన్ పౌడర్‌లోనే లభిస్తాయి. క్యారెట్‌లో 8.3 మి.లీ గ్రాముల విటమిన్ ఏ ఉంటే దీనిలో 9.4 మి.గ్రా ఉంటుంది. అరటిలో 350 మి.లీ గ్రాముల పొటాషియం ఉంటే వీటి ఆకులలో 337 మిల్లీ గ్రాము లు ఉంటుంది. పెరుగులో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటే మునగ ఆకులో 9 గ్రాములు ఉంటుంది. అరెంజ్‌లో 53 మి.గ్రా.ల విటమిన్ సీ ఉంటే వీటిలో 52 మి.గ్రా. లు ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టే కొన్ని బిస్కెట్ కంపెనీలు వారు తయారుచేసే బిస్కెట్లలో మునగ ఆకును వాడుతున్నారు. ఈ విలువలు కలిగిన అధిక ఆకుల దిగుబడిని అందించే మునగ రకాలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

More in రైతుబ‌డి :