ప్రస్తుత పంటల్లో సమయానుకూలంగా ఎరువులు

యాసంగి పంటగా రైతులు తమకు ఉన్న వసతులను బట్టి వివిధ రకాల పంటలను సాగు చేసుకున్నారు. ఏ పంటను సాగు చేసుకున్నప్పటికీ సమయానుకూలంగా సరైన యాజమాన్య పద్ధతులను ఆచరించాలి. అప్పుడే మంచి దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వివిధ పంటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన పద్ధతులను గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి తెలిపారు. పంటల సాగుకు సంబందించి అదనపు సమాచారం కోసం 9440481279 నెంబర్‌ను సంప్రదించవచ్చు. వివిధ పంటలలో చేపట్టాల్సిన చర్యల గురించి ఆయన తెలిపిన వివరాలు.. maize మక్కజొన్నఆరుతడి పంటగా యాసంగిలో సాగు చేసిన మక్కజొన్న పైరు పంటకోత దశలో ఉన్నది. ఈ దశలో గింజల్లో తేమశాతం 25-30 వరకు ఉంటుంది, కండెలను మొక్కల నుంచి వేరుచేసి గింజల్లో తేమ శాతం 15 వచ్చే వరకు 3-4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. -కరెంట్‌తో నడిచే నూర్పిడి యంత్రాన్ని ఉపయోగించి కండెల నుంచి గింజలను వేరుచేసి 12 శాతం తేమ వచ్చే వరకు ఎండలో ఆరబెట్టి శుద్ధి చేసి గోనె సంచుల్లోగానీ, పాలిథీన్ సంచుల్లో గానీ భద్రపరుచుకోవాలి.

వరి మాగాణుల్లో విత్తిన మక్కజొన్న:

-25-30 రోజుల వయసు ఉంటుంది. ఈ తరుణం లో ఎకరాకు 50 కిలోల యూరియా వేయాలి. ఈ సమయంలో కాండం తొలిచేపురుగు ఆశిస్తే దీని నివారణకు కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు ఎకరాకు 3 కిలోల చొప్పున మొక్క సుడుల్లో (మొవ్వలో) వేసుకోవాలి. -మక్కజొన్నలో ఆశించే కత్తెర పురుగు నివారణకు మొక్క మొలిచిన 7-28 రోజుల వరకు తొలిదశలో ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత దశలో ఆశిస్తే పురు గు నివారణకు విషపు ఎరలు 10 కిలలో తవుడు + రెండు కిలోల బెల్లం + 10 గ్రాముల థయోడికార్బ్‌ను తయారీ చేసి ఒక ఎకరా పంటలో మొక్కల సుడుల్లో వేయాలి.

pulses-plant వేరుశనగ: చాలా ప్రాంతాల్లో నవంబర్ నెలలో విత్తారు. ప్రస్తుతం పైరు 60-70 రోజుల వయసులో ఉన్నది. ఈ దశలో టిక్కా ఆకుమచ్చ తెగులు తట్టుకోలేని రకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తుప్పు ఆశించి పంటను నష్టపరుస్తాయి. వీటి నివారణకు క్లోరోథలోనిల్ రెండు గ్రాములు లేదా మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పంటపై పిచికారీ చేయాలి.

sunflower పొద్దు తిరుగుడు: నీటి పారుదల కింద నవంబర్, డిసెంబర్ మాసంలో విత్తిన పొద్దు తిరుగుడు పంట 30-40 రోజుల వయసులో ఉన్నది. ఈదశలో పంటల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. రెండోదఫాగా సిఫారసు చేసిన యూరియా మోతాదు ఎకరాకు 13 కిలోలు (మొగ్గ తొడిగేదశ) వేసుకోవాలి. మొదటి దశలో ఆశించే రసం పీల్చు పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా డైమిథేయేట్ 2.0 మి.లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

Groundnut అపరాలు: వరి మాగాణుల్లో సాగు చేసిన మినుము, పెసర పంటల్లో తొలిదశలో తామర పురుగులు ఆశించడం వల్ల ఆకుముడుత, వైరస్ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయా లి. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే బూడిద తెగులు ఆశించే ప్రమాదం ఉన్నది. ఈ తెగులు నివారణకు ఒక గ్రాము కార్బండిజమ్ లేదా 200 మి.లీల హెక్సాకోనజోల్ లేదా 1 మి.లీ కెరాథేన్ లీటర్ నీటికి కలిపి రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. yadagiri-reddy -నట్టె కోటేశ్వర్‌రావు 9989944945 గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా

More in రైతుబ‌డి :