లైవ్‌లో సన్నీడియోల్ పేరుకు బదులు సన్నీలియోన్..వీడియో వైరల్

ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో న్యూస్ ఛానళ్లలో ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లైవ్‌లో ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్ ఇస్తున్నపుడు తప్పులు దొర్లకుండా చూసుకోవడం చాలా అవసరం. అయితే రిపబ్లిక్ టీవీలో ఇవాళ ఫలితాలు వెల్లడిస్తున్న సమయంలో ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న నటుడు సన్నీడియోల్ ఓట్ల వివరాలు చెప్పే ప్రయత్నంలో..ఎడిటర్, ప్రైమ్ టైం యాంకర్ అర్నాబ్ గోస్వామి పప్పులో కాలేశారు. అర్నాబ్ గోస్వామి బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్‌కు బదులుగా సన్నీలియోన్ అంటూ చెప్పాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవడంతో..సన్నీలియోన్ స్పందించింది. ఎన్ని ఓట్ల ఆధిక్యంలో ఉన్నానని అడుగుతూ..ఫన్నీగా ట్వీట్ చేసింది సన్నీలియోన్.