కృష్ణ‌, అర్జున్ పాత్ర‌లో నాని.. టీజ‌ర్ విడుద‌ల‌

నేచుర‌ల్‌ నాని ప్ర‌స్తుతం మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణార్జున యుద్ధం అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 12న మూవీ విడుద‌లకి ప్లాన్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. హిప్ హాప్ త‌మీజా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. చిత్రంలో నాని డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నాడు. కృష్ణ పాత్రలో ఊర‌మాస్‌గా అల‌రించ‌నున్న‌ నాని, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా సంద‌డి చేయ‌నున్నాడు. శైన్ స్క్రీన్స్ పతాకంపై గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఇక టీజ‌ర్ ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం కృష్ణ‌, అర్జున్ పాత్ర‌ల‌కి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేశారు. మాస్ పాత్ర‌లోనే కాదు, రాక్ స్టార్‌గా కూడా నాని అద‌రగొట్టాడు. ఈ సినిమా కూడా నానికి త‌ప్ప‌క విజ‌యం అందిస్తుంద‌ని అంటున్నారు. నాని నిర్మించిన అ చిత్రం రీసెంట్‌గా విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.
× RELATED ఆహ్లాదం...ఆనందం..ఆరోగ్యం..