బిగ్ బాస్ హౌజ్‌లో గోవిందం సంద‌డి చూశారా..!

సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిత్ర బృందం బిగ్ బాస్ హౌజ్‌కి వెళ్ళి అందులో ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం 2 చిత్రం కోసం బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్ళి హౌజ్‌మేట్స్‌తో స‌ర‌దాగా గ‌డిపారు. వారికి త‌న మూవీ పేరుతో ఉన్న టీ ష‌ర్ట్స్ కూడా అందించారు. ఇక ఈ రోజు అర్జున్ రెడ్డి విజ‌య్ దేవ‌ర‌కొండ బిగ్ బాస్ హౌజ్‌లో ప్ర‌త్య‌క్షం కానున్నారు. త‌న తాజా చిత్రం గీతా గోవిందం సూప‌ర్ హిట్ సాధించ‌డంతో త‌న ఆనందాన్ని అంద‌రితో పంచుకునేందుకు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాంతో క‌లిసి బిగ్ బాస్ హౌజ్‌కి వెళ్లాడు విజ‌య్. గ‌ణేష్ తో స‌ర‌దా సంభాష‌ణ‌లు జ‌రుపుతున్న వీడియోని కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఆన్‌స్క్రీనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోను ఏ రేంజ్ సంద‌డి చేస్తాడో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి ఎపిసోడ్ 71లో ఒక‌వైపు నాని, మ‌రో వైపు హౌజ్‌మేట్స్‌తో అర్జున్ రెడ్డి సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Related Stories: