భారత ఆర్చర్లకు కాంస్యం

archery అంటాల్య(టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు ఎట్టకేలకు కాంస్య పతకంతో ఆకట్టుకున్నారు. పేలవ ప్రదర్శనతో ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్న టోర్నీలో శనివారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంటులో రజత్ చౌహాన్, అభిషేక్ వర్మ, అమన్ సైనీ త్రయం కాంస్య పతకంతో మెరిసింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఈ భారత త్రయం 235-230 తేడాతో రష్యాకు చెందిన అంటోన్ బులయెవ్, అలెగ్జాండర్ దామ్‌బయెవ్, పావెల్ కిర్లోవ్‌పై విజయం సాధించింది. మరోవైపు మహిళల కాంస్య పోరులో వెన్నెం జ్యోతిసురేఖ, ముస్కాన్ కిరార్, స్వాతి దూద్‌వాల్ 226-228 తేడాతో ఇంగ్లండ్‌కు చెందిన లాయ్‌ల అనిసన్, ఎల్లా గిబ్సన్, లూసీ మాసన్ చేతిలో ఓటమిపాలైంది. రికర్వ్ విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశే ఎదురైంది.