రైల్వే స్టేషన్ లో 'అరవింద సమేత'సందడి

జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఆగస్ట్ 15న చిత్ర టీజర్ విడుదల కానుంది. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధిచి లీకు అవుతున్న ఫోటోలు యూనిట్ ని కలవర పెడుతున్నాయి. షూటింగ్ సమయంలోనే కాదు ఎడిటింగ్ చేసే సమయంలోను మూవీ సీన్స్ కి సంబంధించిన ఫోటోలు లీకు అవుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రైల్వే స్టేషన్ లో జరుగుతుండగా, పూజా హెగ్డే, ఎన్టీఆర్ లకి సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చాయి. ఎన్టీఆర్ - పూజా లు బెంచీ పై కూర్చొని ఉండగా, బెంచీ వెనకున్న త్రివిక్రమ్ సీన్ ను వివరిస్తూ ఉంటే ఎన్టీఆర్ అది శ్రద్దగా వింటున్నాడు. పూజా ఒక బ్రైట్ స్మైల్ ఇస్తుందని పిక్ ని చూస్తుంటే అర్ధమవుతుంది. మరో ఫోటోలో పూజా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని దీర్ఘాలోచనలో ఉంది. అత్తారింటికి దారేది చిత్రంలో రైల్వే స్టేషన్ లో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన సీన్ సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ తో తన తాజా చిత్రంలో రైల్వే స్టేషన్ సీన్ ప్లాన్ చేశాడా అని జనాలు ముచ్చటించుకుంటున్నారు. ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. సెకండాఫ్లో ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్గా ఉండడంతో పాటు ఇది పూర్తి రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని సమాచారం.
× RELATED బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు