అర‌వింద స‌మేత‌కి లీకుల దెబ్బ‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అర‌వింద స‌మేత‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. మూవీలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన లుక్స్ అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెంచాయి. తాజాగా సినిమాలో ఎమోష‌న‌ల్ సీన్‌కి సంబంధించిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. గాయాల‌తో ఉన్న నాగ‌బాబుని కారుతో తీసుకెళుతూ దుఃఖంలో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తాడు ఎన్టీఆర్‌. సినిమాకి సంబంధించి ఒక్క‌టి కూడా బ‌య‌ట‌కు రాకుండా ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, ఈ లీకుల బెడ‌ద మాత్రం తీరేట్టు లేదు. చిత్రంలో ఎన్టీఆర్‌కి తండ్రిగా నాగ‌బాబు క‌నిపిస్తార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్నాడు త్రివిక్ర‌మ్. మూవీ షూటింగ్ 50 శాతం పూర్తైన‌ట్టు తెలుస్తుంది. టీజ‌ర్‌ని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట మేక‌ర్స్‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.
× RELATED ఆధార్ కార్డ్ ఉంటే చాలు నేపాల్, భూటాన్ వెళ్లొచ్చు!