రెండో టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి మూవీ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం అరవింద సమేత. ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో ఈ మూవీ రూపొందుతుంది. హైదరాబాద్ శివార్లలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో ప్రధాన పాత్రలపై చిత్రీకరణ జరుగుతుంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 15న చిత్ర టీజర్ విడుదల చేయగా, దీనికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో వినాయక చవితి కానుకగా మరో టీజర్ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దసరా కానుకగా మూవీని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. జగపతి బాబు, నాగ బాబు, రావు రమేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మాణంలో రూపొందుతుంది. ఇటీవల చిత్రానికి సంబంధించిన పలు ఫోటోలు లీకైన సందర్భంగా సెట్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈషా రెబ్బా, బిగ్ బాస్ సీజ‌న్ 1లో ఫైన‌ల్ వ‌ర‌కు వ‌చ్చి విజేతగా నిలిచే అవ‌కాశాన్ని కోల్పోయిన ఆద‌ర్శ్ బాల‌కృష్ణ కూడా అర‌వింద స‌మేతలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?