మ‌ణిర‌త్నంతో 14వ సారి ప‌నిచేస్తున్న ఆస్కార్ విన్న‌ర్‌

ఆణిముత్యాల్లాంటి సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కి అందించిన స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్నాడు మ‌ణిర‌త్నం. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు కూడా కీలక పాత్రలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడ‌ని టీం స‌భ్యుల‌ ద్వారా తెలుస్తుంది. ఇప్ప‌టికే గోవాలో వీరిద్ద‌రు క‌లిసి సాంగ్స్ కంపోజింగ్ మొద‌లు పెట్టార‌ట‌. మ‌ణిర‌త్నంతో పనిచేయ‌డం ఇది ఏఆర్ రెహ‌మాన్‌కి 14వ సారి అని తెలుస్తుంది. మణిరత్నం- అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన రోజా, దళపతి, బొంబాయి మరియు కాదల్ వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ల‌తో పనిచేయడం మణిరత్నంకిదే తొలిసారి. సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నాడు. భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత తొలి సారి సహజ నటి జయసుధ ఈ చిత్రంలో న‌టిస్తుంది. నేచురల్ స్టార్ నాని కూడా మణిరత్నం మల్టీ స్టారర్ లో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.

Related Stories: