ఇదొక ప్రౌడ్ మూమెంట్ అంటున్న మురుగ‌దాస్

ఐకానిక్ ఫిలిం మేక‌ర్ మురుగదాస్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ లో ఓ పిక్ షేర్ చేస్తూ ప్రౌడ్ మూమెంట్ అని కామెంట్ పెట్టారు. మ‌రి అందులో విశేషం ఏంటంటే త‌మిళంలో క్రేజీ ప్రాజెక్ట్స్ డీల్ చేసిన‌ డైరెక్ట‌ర్స్ అంద‌రు క‌లిసిన వేళ అది, మురుగ‌కి అదొక ప్రౌడ్ మూమెంట్ లా అనిపించింది. అందుకే అలా కామెంట్ పెట్టాడు. మురుగ‌దాస్ షేర్ చేసిన ఫోటోలో మురుగ తో పాటు ఆనంద్ శంక‌ర్, రాజ్ కుమార్ పెరియ‌స‌మి, ఆర్. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఉన్నారు. ఆనంద్ శంక‌ర్ విక్ర‌మ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఇరుముగ‌న్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. రాజ్ కుమార్ రంగూన్ చిత్రంతో డైరెక్ట‌ర్ గా డెబ్యూ ఇచ్చాడు. ఈ చిత్రం నిన్న‌నే విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక అజ‌య్ జ్ఙాన‌ముత్తు గ‌తంలో తుపాకి, 7 అమ్ అరివు చిత్రాలకి మురుగ‌దాస్ శిష్యుడిగా చేశాడు. డీమోట్ కాల‌ని చిత్రంతో డెబ్యూ డైరెక్టర్ గా మారిన అజ‌య్ ప్ర‌స్తుతం ఇమైక్క నోడిగ‌ల్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అయితే న‌లుగురు ద‌ర్శ‌కులు ఒకానొక‌ సంద‌ర్భంలో క‌లుసుకోగా, ఇదొక‌ ప్రౌడ్ మూమెంట్ ని అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు మురుగ‌దాస్. ఈ త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం స్పైడ‌ర్ చిత్రంతో బిజీగా ఉండ‌గా సెప్టెంబ‌ర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..