యూఎస్‌బీ టైప్ సి పోర్టులతో రానున్న కొత్త ఐఫోన్లు ?

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తాను త్వరలో విడుదల చేయబోయే నూతన ఐఫోన్లలో యూఎస్‌బీ టైప్ సి పోర్టును అందివ్వనున్నట్లు తెలిసింది. గతేడాది విడుదలైన ఐఫోన్ X ఫోన్‌లోనే యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఏర్పాటు చేస్తారని ముందుగా అందరూ భావించారు. కానీ చివరకు అందులో సాధారణ లైటెనింగ్ పోర్టునే యాపిల్ ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది రానున్న ఐఫోన్లలో మాత్రం కచ్చితంగా యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఏర్పాటు చేస్తారని తెలుస్తున్నది.

ఇప్పటికే పలు మొబైల్ తయారీకంపెనీలు తమ తమ స్మార్ట్‌ఫోన్లలో యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఏర్పాటు చేస్తున్నాయి. కానీ వీటికి వినియోగదారుల నుంచి అంతగా ఆదరణ లభించడం లేదు. ఈ తరహా పోర్టులు ఉన్న ఫోన్ల పట్ల వినియోగదారులు పెద్దగా ఆసక్తిని కనబరచడం లేదు. అందుకనే ఈ పోర్టును యాపిల్ తన ఐఫోన్లలో ఏర్పాటు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నది. అయితే ఇకపై మాత్రం ఈ నిర్ణయానికి స్వస్తి చెప్పి నూతన ఐఫోన్లలో యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఏర్పాటు చేయనుందని తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన మాక్‌బుక్ సిరీస్‌లలో యూఎస్‌బీ టైప్ సి పోర్టులకు సపోర్ట్‌ను అందించగా ఇకపై ఐఫోన్లలోనూ ఈ తరహా పోర్టులను ఏర్పాటు చేసేందుకు యాపిల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య