హైదరాబాద్‌లో యాపిల్ ఫోన్ల స్టోర్లు

హైదరాబాద్ : హైదరాబాద్‌లో యాపిల్ ఫోన్‌లు, ఇతర ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తమ అధీకృత భాగస్వామి అయిన ఆప్‌ట్రోనిక్స్ మరో మూడు స్టోర్లను ఇక్కడ ప్రారంభించింది. నూతనంగా హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, పంజాగుట్టలో ఏర్పాటు చేసిన స్టోర్లతో ఆప్‌ట్రోనిక్స్ తమకు దేశంలో అతిపెద్ద భాగస్వామిగా ఏర్పాటైందని ఒక ప్రకటనలో వెల్లడించింది. నూతన స్టోర్ల ఏర్పాటుతో తెలంగాణలోని వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు వీలు అవుతుందని ఆప్‌ట్రోనిక్స్ సంస్థ ఎండీ సుతీందర్ సింగ్ తెలిపారు.

Related Stories: