తెలుగు క్యారెక్టర్ బగ్‌ను ఫిక్స్ చేసిన యాపిల్..!

గత కొద్ది రోజుల కిందట ఐఓఎస్ 11.2.5 ఆపరేటింగ్ సిస్టమ్‌లో తెలుగు అక్షరం 'జ్ఞా' వల్ల ఆ ఓఎస్‌లోని యాప్స్ క్రాష్ అవడంతోపాటు కొన్ని సందర్భాల్లో ఐఓఎస్ డివైస్‌లు పనిచేయకుండా పోతున్నాయనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తపై యాపిల్ స్పందించి వెంటనే ఫిక్స్‌ను రిలీజ్ చేస్తామని అప్పుడు ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ సంస్థ సదరు బగ్(సాఫ్ట్‌వేర్ లోపం)కు గాను ఫిక్స్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఐఓఎస్ 11.2.6 అప్‌డేట్ ఇప్పుడు ఐఓఎస్ డివైస్‌లకు లభిస్తున్నది. యూజర్లు తమ డివైస్‌లలో ఓఎస్‌ను ఈ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే సదరు జ్ఞా అక్షరం బగ్ నుంచి తప్పించుకోవచ్చని యాపిల్ వెల్లడించింది. ఇక ఐఓఎస్ 11.2.6 మాత్రమే కాకుండా మాక్ ఓఎస్ 10.13.3, వాచ్ ఓఎస్ 4.2.3 అప్‌డేట్లను కూడా యాపిల్ విడుదల చేసింది. ఆయా డివైస్‌లలో ఓఎస్‌లను కొత్త వెర్షన్‌లకు అప్‌డేట్ చేస్తే సదరు బగ్ నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది.

Related Stories: