నేడే యాపిల్ ఈవెంట్.. విడుదల కానున్న కొత్త ఐఫోన్లు..!

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌ను నేడు నిర్వహించనుంది. కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ పార్క్ క్యాంపస్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10.30 గంటలకు యాపిల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మూడు నూతన ఐఫోన్లతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌లు, ఐఓఎస్ 12, పలు నూతన మాక్‌బుక్‌లను కూడా యాపిల్ విడుదల చేయవచ్చని తెలిసింది. ఇక ఈ ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్‌లలో ఐఓఎస్ 10 ఆపైన ఓఎస్ వెర్షన్ ఉన్న డివైస్‌లలో సఫారి బ్రౌజర్‌లో ఈ ఈవెంట్‌ను లైవ్‌లో వీక్షించవచ్చు. అలాగే యాపిల్ టీవీ 2వ జనరేషన్, విండోస్ పీసీల్లో క్రోమ్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లలోనూ యాపిల్ ఈవెంట్‌ను లైవ్‌లో వీక్షించవచ్చు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు