హరికృష్ణ మృతి ఏపీకి తీరని లోటు : సీఎం చంద్రబాబు

అమరావతి : సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతి టీడీపీకి, ఆంధ్రప్రదేశ్‌కు తీరని లోటు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందారు. హరికృష్ణ మృతిపట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా హరికృష్ణ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు చంద్రబాబు. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలో హరికృష్ణది అందెవేసిన చేయి అని తెలిపారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి హరికృష్ణ ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు ఏపీ సీఎం. ఎన్టీఆర్‌కు హరికృష్ణ అత్యంత ఇష్టుడు అని తెలిపారు. ఎన్టీఆర్ చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ అని తెలిపిన చంద్రబాబు.. స్వయంగా ఆ రథాన్ని డ్రైవింగ్ చేస్తూ ఎన్టీఆర్‌ను ప్రజలకు చేరువ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ సభ్యునిగా హరికృష్ణ ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు తెలిపారు.
× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం