జ్యోతిక పాత్రలో అనుష్క..?

హైదరాబాద్: కోలీవుడ్ నటి జ్యోతిక లీడ్ రోల్‌లో నటించిన తమిళ చిత్రం నాచియార్. బాలా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో జ్యోతిక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. బాహుబలి, అరుంధతి, భాగమతిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన అనుష్కను తెలుగు రీమేక్‌లో హీరోయిన్‌గా ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. నిర్మాత కల్పన కోనేరు నాచియార్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరికొన్నిరోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జి అశోక్ డైరెక్షన్‌లో వచ్చిన భాగమతి భారీ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే.
× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు