చై-సామ్ మూవీ సీక్వెల్‌లో అనుష్క‌ ..!

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల ప్రేమాయ‌ణంకి బీజం ప‌డింది ఏ మాయ చేశావే చిత్రం స‌మ‌యంలో అనే సంగతి అంద‌రికి తెలిసిందే. న్యూయర్క్‌ లోని సెంట్రల్‌ పార్క్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ‌ జ‌రుగుతున్న‌ సమయంలో చైతూ, సామ్‌లు ప్రేమ‌లో ప‌డ్డారు. పెళ్లి త‌ర్వాత మ‌ళ్ళీ వీరిరివురు ఆ ప్రాంతానికి వెళ్ళీ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోని సామ్ ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ .. ‘‘సాధారణంగా సెల్ఫీలు దిగటం అంతగా ఇష్టం ఉండదు, కానీ మధుర క్షణాలని ఫోటోలో బంధించ‌క త‌ప్ప‌దు . ఎనిమిదేళ్ల​ క్రితం మా ప్రేమ ఇక్కడే మొదలైంది.. థ్యాంక్యూ సెంట్రల్‌ పార్క్‌ అని’’ పోస్ట్ చేసింది. మ‌రి వారి లైఫ్‌లో ఏ మాయ చేశావే చిత్రం చాలా స్పెష‌ల్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ చిత్రానికి వారు సీక్వెల్ చేస్తార‌ని ప్ర‌చారాలు కూడా జ‌రిగాయి.

ఇటీవ‌ల ఏ మాయ చేశావే చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ..శింబు కథానాయకుడిగా ‘వీటీవీ 2’ (‘వీన్నైతాండి వరువాయా’- తెలుగులో ‘ఏమాయ చేసావె’) చిత్రాన్ని చేస్తాన‌ని అన్నాడు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ మొద‌లు పెట్టాల‌నుకుంటున్న‌ట్టు కూడా వెల్ల‌డించారు. అయితే ఈ సినిమాలో శింబు స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించేందుకు అనుష్క‌ని ఎంపిక చేయాల‌ని యూనిట్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. శింబు, అనుష్క గతంలో ‘వానమ్‌’ సినిమాలో నటించారు. ఇప్పుడు మ‌రోసారి న‌టించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు ఈ జంట సిద్ధంగా ఉందని కోలీవుడ్ టాక్. మ‌రి ఈ వార్త‌ల‌లో నిజ‌మెంత ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

× RELATED కుంభమేళాతో రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం