కష్టాల నుంచి గట్టెక్కిన అనురాగ్ కశ్యప్ మూవీ

కొన్ని సినిమాల పరిస్థితి అంతుబట్టకుండా, అయోమయంగా ఉంటుంది. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. షూటింగ్ ఎంతకాలమో తెలీదు. ఎప్పుడు విడుదలవుతుందో అసలే తెలీదు. ఆ సినిమాలకు అన్నీ బాలారిష్టాలే. కథ, దర్శకుడు, నటీనటులు, ఫైనాన్సెస్, షూటింగ్ షెడ్యూల్స్, ఒకటనేమిటి .. అన్ని దశల్లోనూ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా అనేక కష్టాల్లో పడి .. చాలాకాలం పెండింగ్ లో ఉన్న ఓ బాలీవుడ్ సినిమా కూడా త్వరలో స్టార్ట్ కాబోతోంది. కొన్నాళ్ళ నుండి బాలీవుడ్ ప్రేక్షకులని ఊరిస్తూ వస్తున్న 'మన్మర్జియాన్' సినిమా ఎట్టకేలకి పట్టాలెక్కబోతుంది. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మొదట ఆయుష్మాన్ ఖురానా, భూమి ఫడ్నేకర్లను అనుకున్నారు, కానీ కుదరలేదు . దీంతో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, తాప్సీ, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. 'మన్మర్జియాన్' సినిమా దర్శకుడి విషయంలోను పలు మార్పులు జరిగాయి. మొదట సమీర్ శర్మను అనుకున్నారు. తర్వాత ఆయన ఛేంజ్ అయి.. శ్వనీ అయ్యర్ తివారీ పేరు వినిపించింది. అతనూ మారాడు. ఇక చిట్టచివరికి అనురాగ్ కశ్యప్ ను ఫిక్స్ చేశారు. దీంతో వచ్చే నెల నుండి హిమాచల్ ప్రదేశ్లో 'మన్మర్జియాన్' షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కార్వాన్ అనే హిందీ చిత్రం చేస్తున్న దుల్కర్ కి ఇది రెండో సినిమా.

Related Stories: