బబ్లీ గార్ల్ అనుపమ లేటెస్ట్ ఫోటో షూట్ – వీడియో

మలయాళ చిత్రం ప్రేమమ్ తో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ తొలి సినిమాతో నే పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ విజయంతో అనుపమ పలువురు దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఇక అక్కడి నుండి ఈ అమ్మడికి ఆఫర్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మూడు సంవత్సరాలలో దాదాపు 7 సినిమాలు చేసిన ఈ అమ్మడు 2018లో మరో మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అ..ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అనుపమ , టాలీవుడ్ లో రీమేక్ అయిన ప్రేమమ్ లోను నటించింది. తాజాగా 'JFW - Just For Women' మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది అనుపమ. స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో మెరిసిపోతున్న అనుపమని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో తాను చెప్పిన సమాధానాలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి.

Related Stories: