త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించిన అనుప‌మ‌

మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రంతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ‌ర డివైడ్ టాక్ తెచ్చుకోవ‌డంతో త‌న త‌దుప‌రి సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంది. అయితే కొద్ది రోజులుగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఆరోగ్యానికి సంబంధించి పలు పుకార్లు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. అనుప‌మ ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింద‌ని అన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చింది అనుప‌మ‌. సెట్స్‌లో ప్రకాశ్ రాజ్‌తో డైలాగ్ చెబుతున్న స‌మ‌యంలో, అనుకున్నంత బాగా సరైన సమయానికి డైలాగ్ చెప్పలేక తడపడ్డాను. మ‌రో టేక్ చేద్దామ‌ని ఆయ‌న అన్నారు. కాని ఉద‌యం నుండి జ్వరం, లో బీపీతో బాధ‌ప‌డుతున్న న‌న్ను గ‌మ‌నించి యూనిట్ స‌భ్యులు ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్స్ మందులు ఇచ్చి పెద్ద ప్ర‌మాదం ఏమి లేద‌ని చెప్పుకొచ్చింది మ‌ల‌యాళ భామ అనుప‌మ‌.

Related Stories: