పెద్ద సినిమాలే చేస్తానంటున్న ప్రేమమ్ భామ

టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కైనా ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే చాలు ఇక అంతా ఆమె వెంటే పడుతుంటారు. యంగ్ హీరోయిన్స్ కొరత ఉండడంతో ఇది తప్పడం లేదంటున్నారు నిర్మాతలు. ముఖ్యంగా పరభాషా తారలు ఇట్టే ఛాన్సులు కొట్టేస్తున్నారు. కీర్తి సురేష్‌, రాశిఖన్నా వంటి కొత్త హీరోయిన్స్ చాలా స్పీడ్ గా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ కు క్రేజీ హీరోయిన్ అయింది. దాంతో ఈ కుట్టి కండిషన్స్ పెడుతోంది. అనుపమ చేసిన సినిమాలు వరసగా హిట్ కావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఆమెపై పడింది. అ..ఆ.., ప్రేమమ్ హిట్ కావడం అనుపమా పరమేశ్వరన్ కు బాగా కలిసొచ్చింది. ఇక లేటెస్ట్ గా శతమానం భవతి కూడా హిట్ కావడంతో అనుపమ తెలుగులో హ్యట్రిక్ కొట్టింది. ఇక సుకుమార్ - చరణ్ కాంబినేషన్లో రాబోవు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ని జస్ట్ లో మిస్ అయింది. ఎన్టీఆర్- బాబి సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించనుందనే ఓ వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది. అనుపమ ఇకపై పెద్ద సినిమాలనే ఒప్పుకోవాలని అనుకుంటోందట. అలాగే వీలైనంత వరకూ సోలో హీరోయిన్ గా చేయాలని డిసైడ్ అయిందట. ఎన్టీఆర్ సినిమా ఓకే అయితే అది అను కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావచ్చని, దాంతో ఆమెకు ఒక రేంజ్ స్టేటస్ రావచ్చని అంటున్నారు. సిట్యుయేషన్‌ చూస్తే ముందు ముందు డెఫినెట్ గా అనుపమ హవా కొనసాగుతుందంటున్నారు.

Related Stories: