రవితేజ సినిమా నుండి త‌ప్పుకున్నాన‌న్న అను ఎమ్మాన్యుయేల్‌

నాని ప్రధాన పాత్రలో రూపొందిన మజ్ఞు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నటి అను ఇమ్మాన్యుయేల్. ఈ చిత్రంలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. ఆ త‌ర్వాత బన్నీ సరసన నా పేరు సూర్య. . నా ఇల్లు ఇండియా అనే చిత్రంలోను నటించింది. ఇక ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ హీరోగా తెర‌కెక్కుతున్న శైల‌జా రెడ్డి అల్లుడు అనే చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది. శ్రీను వైట్ల‌- ర‌వితేజ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని సినిమాలోను అను ఎమ్మాన్యుయేల్‌ని క‌థానాయిక‌గా తీసుకున్నారు. కాని డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డం వ‌ల‌న అను ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని మూవీ చిత్రీక‌ర‌ణ చిత్రీకరణ 50 రోజుల పాటు అమెరికాలో జరుగనుందట. ఈ 50 రోజుల షెడ్యూల్‌కి అను డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోవడం వల్లనే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లుగా నిర్మాత‌లు తెలిపారు.ఈ విష‌యంపై అను కూడా క్లారిటీ ఇచ్చింది. నాగచైతన్యతో చేస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంకి, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రానికి మధ్య డేట్స్ క్లాష్ అవుతుండటంతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా ఆమె తెలిపింది. అంతేకాదు ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్ర యూనిట్‌కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలిపింది అను.

‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో ర‌వితేజ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆయ‌న స‌ర‌స‌న జ‌త‌క‌ట్టేందుకు ఇలియానా , శృతి హాస‌న్ పేర్ల‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. హీరోయిన్‌గా ఎవరినీ తీసుకుంటారు అనేది చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేస్తారట. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ర‌వితేజ - శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు భారీ విజ‌యాలు సాధించ‌డంతో ఈ మూవీ పై కూడా చాలా హోప్స్ ఉన్నాయి.

× RELATED కివీస్ కెప్టెన్ ఒంట‌రి పోరాటం