అను బేబి వీడియో సాంగ్ వ‌చ్చేసింది

నాగ చైత‌న్య‌, అను ఎమ్మాన్యుయేల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారుతి తెర‌కెక్కించిన చిత్రం శైల‌జా రెడ్డి అల్లుడు. ఈ చిత్రంలో అత్త పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ న‌టించారు . ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. ఇటీవ‌ల‌ ర‌మ్య‌కృష్ణ‌కి సంబంధించిన స‌న్నివేశాలతో పాటు మిగ‌తా చిత్రీక‌ర‌ణ కూడా ముగిసింది . ఆగ‌స్ట్ నెలాఖ‌రులో మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు. శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించి అను బేబి వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఇది టీజింగ్ సాంగ్ అని అర్ద‌మ‌వుతుంది. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందించాడు. తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

× RELATED కుంభమేళాతో రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం