నర్తనశాలలో ఆటపాట

నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం @నర్తనశాల. శ్రీనివాసరావు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి, శంకర్‌ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ నేపథ్య గీతాన్ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ కథానుగుణంగా చిత్రానికి నర్తనశాల అనే పేరుపెట్టాం. పాత నర్తనశాల చిత్రం పేరును చెడగొట్టకుండా జాగ్రత్తగా సినిమా తీస్తున్నాం. ఈ చిత్రానికి సాగర్ మంచి పాటలిచ్చారు అన్నారు. వినోదం, సెంటిమెంట్ కలబోతగా సాగే చిత్రమిది. ఐదు పాటలుంటాయి. చక్కటి బాణీలతో సాగర్ సంగీతాన్ని సమకూర్చారు అని దర్శకుడు తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ టాకీపార్ట్‌తో పాటు మూడు పాటలు పూర్తయ్యాయి. ఈ నెల 10 నుంచి 20 వరకు విదేశాల్లో రెండు పాటల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆగస్ట్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. చక్కటి కథాబలమున్న చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కథానాయికలు కాశ్మీరా, యామినీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్, సుధా, విజయ్‌కుమార్, కిరణ్‌కుమార్, ప్రియా తదితరులు పాల్గొన్నారు.

× RELATED పొల్లాచ్చిలో వ్యవసాయం