మ‌రో తెలుగు సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా అనిరుధ్‌

త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న రెండో సినిమాని ప్ర‌క‌టించాడు. మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని చేయ‌నున్న జెర్సీ చిత్రానికి తాను సంగీతం అందించ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. నాని ప‌దేళ్ళ జ‌ర్నీ పూర్తి చేసిన క్ర‌మంలో తాను ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాడు. అస‌లు అనిరుధ్ .. త్రివిక్ర‌మ్-జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న అర‌వింద స‌మేత చిత్రానికి మ్యూజిక్ అందించాల్సి ఉండ‌గా, ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. జెర్సీ చిత్రంలో నాని మూడు విభిన్న రూపాల‌లో క‌నిపించి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తాడ‌ని అంటున్నారు. కాలేజ్ విద్యార్ధి కం యంగ్ హీరో పాత్ర‌తో పాటు పెళ్ల‌యిన న‌డివ‌య‌స్కుడు, ముస‌లి వ్య‌క్తిగా మూడు ద‌శ‌ల‌లో మూడు విభిన్న రూపాల‌లో నాని మురిపిస్తాడ‌ని స‌మాచారం. నాని మూడు పాత్ర‌ల‌ని ఛాలెంజ్‌గా తీసుకొని న‌టిస్తున్నాడ‌ని చెబుతున్నారు. న‌ట‌నకి ఆస్కారం ఉన్న ఈ మూడు పాత్ర‌ల‌తో నాని చేయ‌బోయే మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
× RELATED కుంభమేళాతో రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం