శ్రీదేవి జ్ఞాపకాలను పంచుకున్న అనిల్‌కపూర్

ముంబై: అలనాటి అందార తార శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని నటుడు అనిల్‌కపూర్ ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనిల్‌కపూర్ శ్రీదేవితో కలిసి పలు సినిమాల్లో నటించాడు. శ్రీదేవి అందమైన ఫ్యామిలీ ఫొటోను అనిల్‌కపూర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. శ్రీదేవి, భర్త బోనీకపూర్ కూతుళ్లు జాన్వీకపూర్, ఖుషీకపూర్ కలిసి దిగిన ఫొటోను అనిల్ కపూర్ షేర్ చేశాడు.

‘అందమైన తల్లి (శ్రీదేవి)కి ప్రతిబింబంగా జాన్వీ, ఖుషీ కనిపిస్తున్నారు. జాన్వీ, ఖుషీ వల్ల శ్రీదేవి మా మధ్య లేదని ఒక్క రోజు కూడా అనిపించలేదు. తెరపై అందమైన హావభావాలతో ప్రతీ ఒక్కరి మనసును గెలుచుకుంది శ్రీదేవి. జాన్వీ, ఖుషీతో ఆమెను మిస్సవుతున్నామన్న ఆలోచన రాలేదు. శ్రీదేవి తమ మనసు, హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటుందని’ ట్వీట్ చేశాడు అనిల్‌కపూర్.

× RELATED ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్