పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదో ఊరట. పెట్రోల్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి లీటరుపై రూ.2 తగ్గిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్‌పై తగ్గించిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రో ధరలను నిరసిస్తూ ఇవాళ విపక్షాలు దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Related Stories: