వేలుపుగొండలో రాతిచిత్రాలు లభ్యం

తెలంగాణ చరిత్రకారుల పరిశోధనలో వెలుగులోకి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రాతిచిత్రాలు ఇటీవల తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, వేముగంటి రఘునందన్, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, బొగ్గుల శంకర్‌రెడ్డి.. మెదక్ జిల్లా టెక్మల్ మండలం, వేలుపుగొండలో విష్ణుకుండీల కాలంనాటి రాతిచిత్రాలను కనుగొన్నారు. అప్పటికాలం శివాలయం, గుండం, నివాసాల జాడలు ఎరుపురంగులో కనిపించిన రాతిచిత్రాలు అద్భుతమైన పికాసో చిత్రాలుగా ఉన్నాయని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నాలుగు ఎరుపురంగు రాత్రిచిత్రాలు బయటపడగా, మరికొన్ని జీర్ణమైపోయాయని తెలిపారు. పూర్వమానవులు రాతిగుహల్లో మధ్యరాతియుగాల నుంచి నివసించినట్టు ఈ చిత్రాలు రుజువు చేస్తున్నాయన్నారు. మరింత లోతుగా అన్వేషిస్తే ఈ గుట్టల్లో మరిన్ని రాతిచిత్రాలు దొరికే అవకాశం ఉందన్నారు.

Related Stories: